: తొలి ముఖ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఫ్రెంచ్ మహిళ మృతి... ఆలస్యంగా వెలుగు చూసిన వార్త!


ప్రపంచంలోనే తొలిసారి పాక్షిక ముఖ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఫ్రెంచ్ మహిళ ఇసాబెల్లె డినోయిరే(49) మృతి చెందిన వార్త చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. 2005లో ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న ఇసాబెల్లె గతేడాది ఏప్రిల్ 22న మృతి చెందినట్టు యూనివర్సిటీ ఆఫ్ అమీన్స్ మంగళవారం పేర్కొంది. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ప్రాంతంలో ఆపరేషన్ వికటించడంతో ఇసాబెల్లె పెదవులు కదపడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే ఆమె అనారోగ్యానికి కారణంగా తెలుస్తోంది. ఇసాబెల్లే కుటుంబ గోప్యతను కాపాడే ఉద్దేశంతోనే ఆమె మరణ వార్తను ఇన్నాళ్లూ వెల్లడించలేకపోయినట్టు వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News