: ఏపీకి విభజన హామీలన్నీ అమలవుతాయి: బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలన్నీ అమలవుతాయని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, 2014-15 నుంచి 2018-19 వరకు రెవెన్యూ లోటును భర్తీ చేయాలని 14వ ఆర్థిక సంఘం నిర్ణయించగా, 2014-15 మినహా మిగిలిన సంవత్సరాల ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు కేంద్రం 22 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని అన్నారు. ఈ ఏడాదికి సంబంధించిన లోటుపై రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం చర్చలు జరుపుతోందని ఆయన తెలిపారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన ప్యాకేజీలో భాగంగా ప్రతి ఏటా జిల్లాకి 50 కోట్ల రూపాయల చొప్పున ఆరేళ్లపాటు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News