: నయీమ్ మాకు దూరపు బంధువు: నయీమ్ అనుచరుడు తాజుద్దీన్
ఇటీవలే తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో అతడి అనుచరుడు తాజుద్దీన్‌ను నేడు సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా తాజుద్దీన్ పలు విషయాలను వెల్లడించాడు. నయీమ్ తమకు దూరపు బంధువని చెప్పాడు. నయీమ్ చేసిన అక్రమాలతో, అతనిపై ఉన్న కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నాడు. తాను గోవాలో నయీమ్ గెస్ట్ హజ్‌కి వాచ్‌మెన్‌గా కూడా పనిచేసినట్లు తాజుద్దీన్ చెప్పాడు. నయీమ్ అప్పుడప్పుడు గెస్ట్‌హౌజ్‌కి వచ్చి వెళుతుండేవాడని ఆయన పేర్కొన్నాడు.