: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఏబీ డివిలియర్స్.. రెండో స్థానంలో కొనసాగుతున్న కోహ్లీ


ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) తాజాగా విడుద‌ల చేసిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌ విరాట్ కోహ్లి త‌న రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్ వ‌న్డేల్లో అగ్రస్థానంలో నిల‌వ‌వ‌గా.. 813 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఆ త‌రువాతి స్థానంలో ద‌క్షిణాఫ్రికాకే చెందిన బ్యాట్స్‌మెన్‌ హషీమ్ ఆమ్లా ఉన్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ జో రూట్ తొలిసారి టాప్ ఫైవ్‌లో చోటు సంపాదించాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ఐదో ర్యాంకులో కొన‌సాగుతున్నాడు. కాగా టీమిండియా ఆట‌గాడు రోహిత్ శర్మ తాను కొన‌సాగుతున్న‌ ఆరో స్థానాన్ని కోల్పోయి, ఏడో స్థానానికి పడిపోయాడు.

  • Loading...

More Telugu News