: కశ్మీర్ సీఎంను కుక్క తోకతో పోల్చిన సుబ్రహ్మణ్యస్వామి!
బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ లో నెలకొన్న తాజా పరిస్థితులను ప్రస్తావించిన ఆయన ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీని కుక్క తోకతో పోల్చారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ముఫ్తీపై విరుచుకుపడ్డారు. ‘‘కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి. కుక్క తోక వంకర పోనట్లే... ముఫ్తీ వైఖరిలోనూ ఏ మార్పూ లేదు. ఇక ఎప్పటికి కూడా ముఫ్తీ వైఖరి మారదు. ఆమెకు ఉగ్రవాదులతో లింకులున్నాయి. ఆమె వైఖరిలో మార్పు తీసుకొచ్చేందుకే ఆమె పార్టీతో కలిసి బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు మొగ్గుచూపింది’’ అని స్వామి వ్యాఖ్యానించారు.