: ‘డేటా వార్’లో బీఎస్ఎన్ఎల్.. రూ.249కే 300 జీబీ డేటా
డేటా వార్‌లో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) చేరిపోయింది. రిలయన్స్ జియో దెబ్బకు ప్రముఖ నెట్వర్క్ సంస్థలు కకావికలమవుతున్న వేళ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌తో వినియోగదారుల ముందుకొచ్చింది. డేటా పోరులో తానూ ఉన్నానంటూ చెప్పకనే చెప్పుకొచ్చింది. వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. రూ.249కే అపరిమిత ఇంటర్నెట్ అంటూ ప్రకటించి ఇతర నెట్వర్క్ కంపెనీలతో పోరుకు దిగింది. రూ.249 పెట్టి రీచార్జ్ చేసుకుంటే ఇష్టం వచ్చినంత (అపరిమిత) ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఆ తర్వాత 1 జీబీ వరకు 2 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. అనంతరం 1 ఎంబీపీఎస్‌తో నెలంతా ఇంటర్నెట్ను వాడుకోవచ్చు. ఈ నెల 9 నుంచి ఈ ప్లాన్ అమలులోకి వస్తుంది.