: యువతిపై టీడీపీ కౌన్సిలర్ వేధింపులు!... కేసు నమోదు చేసిన తెనాలి పోలీసులు!


ఏపీలో అధికార పార్టీ టీడీపీకి కింది స్థాయి నేతల వైఖరి తలనొప్పిగా మారింది. ప్రభుత్వంలోని పెద్దలు ఆరోపణలకు ఆమడ దూరంలో ఉంటూ పాలన సాగిస్తుండగా... కింది స్థాయి నేతలు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీ ప్రతిష్ఠను మంటగలిపేస్తున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... పట్టణంలో కౌన్సిలర్ గా ఉన్న టీడీపీ నేత పెండ్యాల వెంకట్రావు ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారట. పెండ్యాల చేష్టలతో చిర్రెత్తుకొచ్చిన బాధిత యువతి తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో వెంకట్రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఇరు వర్గాలను పిలిపించి విచారణ నిర్వహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News