: ఎన్టీఆర్, రాజీవ్ కనకాలల ఆసక్తికర సంభాషణ!
'జనతా గ్యారేజ్' సక్సెస్ తో మంచి జోరు మీదున్న జూనియర్ ఎన్టీఆర్, నటుడు రాజీవ్ కనకాల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. 'జనతా గ్యారేజ్' సక్సెస్ మీట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ, నటుడిగా జూనియర్ ఎంతో పరిణతి సాధించాడని అన్నాడు. సన్నివేశానికి తగిన భావాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నాడని, ఇది ఆ సన్నివేశం పండడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపాడు. నటుడిగా అంతకంటే సాధించడానికి ఇంకేముందని అన్నాడు. ఈ సందర్భంగా రాజీవ్ వైపు ఆనందంగా చూసిన ఎన్టీఆర్, 'రాజు.. శభాష్' అన్నాడు. దీంతో రాజీవ్ తన ముఖాన్ని అదోలా పెట్టాడు. ఎందుకంటే, రాజీవ్ కనకాలను ఎవరైనా 'రాజు' అని పిలిస్తే అతనికి అస్సలు ఇష్టం ఉండదట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ చెబుతూ, అందుకే రాజీవ్ కనకాల పేరును తన మొబైల్ ఫోన్ లో 'రాజు' పేరిట ఫీడ్ చేసుకున్నానని చెప్పాడు. అలాగే తన పేరును రాజీవ్ తన మొబైల్ లో 'కిడ్' అనే పేరుతో ఫీడ్ చేసుకున్నాడని ఎన్టీఆర్ చెప్పాడు. దీని వెనుక చిన్న కథ వుందని చెప్పి ఆ టాపిక్ ను ఎన్టీఆర్ అంతటితో కట్ చేశాడు.