: నాకెలా నచ్చితే అలా నటించమన్నారు... ఒత్తిడి లేదు!: శ్రీకాంత్ కుమారుడు రోషన్


'నిర్మలా కాన్వెంట్' సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కావడం ఆనందంగా ఉందని ప్రముఖ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ తెలిపాడు. 'నిర్మలా కాన్వెంట్' సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, తొలి సినిమా అనుభవం బాగుందని అన్నాడు. ఈ సినిమాలో ఫైట్లు, డాన్సులు ఉండవని చెప్పాడు. మంచి కథ మాత్రమే ఉంటుందని తెలిపాడు. ఓ టీనేజ్ లవ్ స్టోరీకి సూపర్ స్టార్ కలిస్తే ఎలా ఉంటుందో అంత ఆసక్తిగా ఉంటుందని అన్నాడు. ఈ సినిమా తరువాత రెండేళ్లు విరామం తీసుకుంటానని, స్టడీస్ పై ధ్యాస పెడతానని చెప్పాడు. తొలి సినిమా కావడంతో ఫలితంపై చాలా ఉత్కంఠగా ఉన్నానని అన్నాడు. ఇక షూటింగ్ సమయంలో, ఎలా నచ్చితే అలా నటించమని తన తల్లిదండ్రులు చెప్పారని, కెమెరా ముందుకు వెళ్లేటప్పుడు మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచించాలని తల్లిదండ్రులు సలహా ఇచ్చారని అన్నాడు. సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందని రోషన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News