: ఆల్ కాయిదాకు మరో ఎదురు దెబ్బ... అమెరికా వైమానిక దాడుల్లో ఏడుగురు ఉగ్రవాదుల హతం
ప్రపంచవ్యాప్తంగా దారుణ మారణాలకు పాల్పడిన ఆల్ కాయిదా ఉగ్రవాదులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆల్ కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టిన అమెరికా... ఆ సంస్థను నామరూపాల్లేకుండా చేసేందుకు యత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఆల్ కాయిదా ఉగ్రవాదుల స్థావరాలపై అమెరికా ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇందులో భాగంగా తాజాగా యెమెన్ లోనూ అమెరికా వైమానిక దాడులకు శ్రీకారం చుట్టింది. యెమెన్ లోని ఆల్ వాడీలోని ఓ అపార్ట్ మెంట్ పై అమెరికా ప్రయోగించిన ఓ డ్రోన్ దాడిలో... ఆల్ కాయిదా ఉగ్రవాదులుగా భావిస్తున్న ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.