: అనుమతి లేకుండా బైక్ ఎక్కిన బైరెడ్డి!... అరెస్ట్ చేసిన కర్నూలు ఖాకీలు!
బైకు ఎక్కేందుకు కూడా పోలీసుల అనుమతి కావాలా? అంటే... అదేమీ లేదు కాని, బైక్ ర్యాలీ నిర్వహించాలంటే మాత్రం ఖాకీల అనుమతి తప్పనిసరే కదా. వినాయక చవితిని పురస్కరించుకుని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అధినేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి నేటి ఉదయం కర్నూలు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. స్వయంగా బైకు ఎక్కిన ఆయన తన అనుచర గణంతో నగరంలో హల్ చల్ చేశారు. అయితే ఈ బైక్ ర్యాలీకి బైరెడ్డి పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదు. నగరంలోని మెడికల్ సెంటర్ నుంచి బుధవారపేట వరకు ఈ ర్యాలీ చేరుకోగానే రంగంలోకి దిగిన పోలీసులు బైరెడ్డి సహా ఆయన అనుచరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.