: జమ్ము కశ్మీర్ ముమ్మాటికీ భారత్ లో అంతర్భాగమే!... మరోసారి స్పష్టం చేసిన రాజ్ నాథ్ సింగ్!


జమ్ము కశ్మీర్ కు అఖిల పక్షాన్ని తీసుకెల్లిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. జమ్ము కశ్మీర్ ముమ్మాటికీ భారత్ లో అంతర్భాగమేనని ఆయన స్పష్టం చేశారు. అఖిల పక్ష బృందంతో చర్చలు జరిపేందుకు కశ్మీర్ వేర్పాటువాద నేతలు తిరస్కరించిన నేపథ్యంలోనే రాజ్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీసుకున్న చర్యలను రాజ్ నాథ్ కీర్తించారు. అఖిల పక్ష బృందంతో చర్చలకు వేర్పాటువాద నేతలు సుముఖత వ్యక్తం చేయకపోవడం సరికాదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News