: మంచి కథలు, సినిమాలు దొరుకుతాయి... మంచి మనుషులే దొరకరు: నాని
మంచి కథలు, సినిమాలు దొరుకుతాయి కానీ మంచి మనుషులే దొరకరని సినీ నటుడు నాని చెప్పాడు. ఒకవేళ మంచి మనుషులు దొరికితే వారిని వదులుకోకూడదని నాని తెలిపాడు. అందుకే తాను విరించి వర్మతో సినిమా చేశానని అన్నాడు. విరించి వర్మ అడిగితే డేట్స్ ఏంటి? ఏకంగా పిల్లనే ఇచ్చేయొచ్చు... అలాంటిది డేట్స్ ఇవ్వనా? అని వెంటనే డేట్స్ ఇచ్చేశానని అన్నాడు. ఈ సినిమా నిర్మాత గీత తాను 'అష్టా చెమ్మా' చేయకముందు నుంచే తెలుసని చెప్పాడు. తాను హీరోనవుతానని తనకే నమ్మకం లేని రోజుల్లోనే వారికి తనపై నమ్మకమని నాని తెలిపాడు. 'మజ్ను' సినిమా అద్భుతమైన అనుభూతిగా మిగులుతుందని నాని చెప్పాడు. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నానని, ఈ ప్రయత్నం అందర్నీ అలరిస్తుందని అన్నాడు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని తెలిపాడు.