: డీకే అరుణ, పొన్నాల ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ మద్దతు
గద్వాల, జనగామలను జిల్లాలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య చేపట్టిన పోరాటానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మద్దతు ప్రకటించారు. వారిపై ఎంపీ కవిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసమే జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జిల్లాల ఏర్పాటులో నిరంకుశత్వం కనిపిస్తోందని ఆయన విమర్శించారు. వరంగల్, హన్మకొండ విభజన ప్రజాభీష్టానికి వ్యతిరేకమని ఆయన చెప్పారు. యాదాద్రికి ఉన్న అర్హత జోగులాంబకు వర్తించదా? అని ఆయన ప్రశ్నించారు. గోల్కొండ కోటకు ఇచ్చిన ప్రాధాన్యత గద్వాల కోటకు ఇవ్వరా? అని ఆయన ఆయన నిలదీశారు. అహంకారం తలకెక్కితే ప్రజలు తిప్పికొడతారని గుర్తించాలని ఆయన సూచించారు.