: కుమార్తె పేరును ప్రకటించిన హర్భజన్, గీతా జంట


ఇటీవల పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన క్రికెటర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ నటి గీతా బస్రా జంట, తమ బిడ్డకు పెట్టిన పేరును వెల్లడించింది. తన కుమార్తెకు 'హినయ హీర్‌ ప్లహా' అని పేరు పెట్టామని హర్భజన్ సింగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. పాప జన్మించిన తరువాత అభినందనలు, ఆశీర్వాదాలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. గత సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితురాలు గీతను హర్భజన్ సింగ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News