: ఎయిర్ ఆసియా వినాయక చవితి స్పెషల్ ఆఫర్... రూ. 899కి టికెట్
ఈ వినాయక చవితి సందర్భంగా విమాన టికెట్ల స్పెషల్ ఆఫర్ ను 'బిగ్ సేల్' పేరిట ఎయిర్ ఆసియా ప్రకటించింది. ఇందులో భాగంగా వివిధ గమ్యస్థానాలకు రూ. 899 నుంచి టికెట్లు విక్రయించనున్నట్టు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమర్ అబ్రోల్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపటి నుంచి 11వ తేదీ వరకూ ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 6 నుంచి అక్టోబర్ 28 మధ్య ప్రయాణ తేదీ ఉండాలని వివరించారు. కొచ్చి, గౌహతి, హైదరాబాద్, గోవా తదితర ప్రాంతాల నుంచి బయలుదేరే 'ఐ5' ఫ్లయిట్ కోడ్ సర్వీసులకు ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ఇదే సమయంలో రూ. 3,399కి కౌలాలంపూర్, బ్యాంకాక్, ఫుకెట్, బాలి తదితర గమ్యస్థానాలకు టికెట్లను అందిస్తామని తెలిపారు.