: మీ ఊరికి నీళ్లు తీసుకెళ్లారు సంతోషమే, పక్క ఊళ్ల సంగతేంటి?: చంద్రబాబును ప్రశ్నించిన పెద్దిరెడ్డి


చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి నీళ్లు అందిస్తున్నారని, ఈ విషయం ఆనందకరమే అయినప్పటికీ, పక్క నియోజకవర్గాల రైతుల సంగతేంటని వైకాపా ప్రశ్నించింది. ఈ ఉదయం చిత్తూరులో పర్యటించిన వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఏ తప్పూ చేయకపోతే హైకోర్టుకు ఎందుకు వెళ్లారని, విచారణపై స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. తప్పు చేయకుంటే కేసును ధైర్యంగా ఎందుకు ఎదుర్కోలేదని అడిగారు. పంటలు ఎండిపోయిన తరువాత రెయిన్ గన్ లు ఎందుకని విమర్శించారు.

  • Loading...

More Telugu News