: ఆర్మీ మాజీ చీఫ్ తనయుడి కోసం ‘అల్ ఖైదా’ అధినేత కూతుళ్లను విడిచిపెట్టిన పాక్ ప్రభుత్వం
‘అల్ ఖైదా’ చెరలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అష్ఫక్ పర్వేజ్ కయానీ తనయుడిని విడిపించుకునేందుకుగాను ఆ ఉగ్ర సంస్థ అధినేత అల్-జవహరి ఇద్దరు కూతుళ్లను పాక్ ప్రభుత్వం విడిచిపెట్టింది. ఈ విషయాన్ని ‘అల్ ఖైదా’ తన మ్యాగజైన్ అల్-మస్రాలో పేర్కొంది. అయితే, ఈ ఒప్పందానికి తొలుత పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ, ఒక రేంజ్ లో జరిగిన సంప్రదింపుల నేపథ్యంలో ఈ ఒప్పందానికి పాక్ ప్రభుత్వం తలొగ్గాల్సి వచ్చింది. కాగా, ఈ సంఘటనతో దేశంలో టెర్రరిజం ఎంతగా బలపడిందనే విషయం అర్థమవుతుందని అంటున్న వారూ లేకపోలేదు.