: బొండా ఉమా కంప్లెయింట్ ఎఫెక్ట్!... పోలీస్ స్టేషన్ చేరిన కోగంటి సత్యం!


విజయవాడ డూండి గణేశ్ సేవా సమితిలో నిన్న పొడచూపిన విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. నిన్న ఓ ప్రైవేటు న్యూస్ ఛానెల్ నిర్వహించిన లైవ్ షోలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, నగరానికి చెందిన పారిశ్రామికవేత్త కోగంటి సత్యంల మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నువ్వు రౌడీ అంటే... కాదు నువ్వే రౌడీవంటూ వారిద్దరూ పరస్పరం సంధించుకున్న విమర్శలతో సమితి రెండుగా చీలిపోయింది. ఆ తర్వాత కోగంటి సత్యంపై బొండా ఉమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సూర్యారావుపేట పోలీసులు కోగంటి సత్యంను నిన్న రాత్రికే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డూండీ గణేశ్ సేవా సమితిలో జరిగిన అవకతవకలపై సత్యంను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News