: శివాజీకి అసలు అవగాహన లేదు: టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి
కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై సినీ నటుడు శివాజీ వ్యాఖ్యలు అభ్యంతరకరమని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, రాజకీయాలను అడ్డుపెట్టుకుని సుజనా చౌదరి ఏనాడూ వ్యాపారాలు చేయలేదని అన్నారు. వ్యాపారాలు చేస్తూనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు వేరు, ఆర్థిక నేరాలు వేరని ఆయన తెలిపారు. సుజనా చౌదరి ఏనాడూ ఆర్థిక నేరాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. శివాజీ అసలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.