: తెలంగాణ వచ్చి రెండేళ్లయింది... ఇక స్పీడ్ పెంచండి కేసీఆర్!: గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
"తెలంగాణ ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది. ఇంకా చాలా విషయాల్లో ఎంతో మెరుగుపడాల్సి వుంది. కేసీఆర్... స్పీడ్ పెంచండి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఎంతో మార్పు రావాల్సి ఉంది. ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన వారు విద్యార్థినీ విద్యార్థులకు ఎలాంటి విద్యను అందిస్తున్నామన్న విషయమై దృష్టి పెట్టాలి" అని గవర్నర్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచే దిశగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేసీఆర్ వేదికపై లేనప్పటికీ, ఆయన పేరును ప్రస్తావించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత గవర్నర్ వ్యాఖ్యలను ఆసక్తిగా వినడం గమనార్హం.