: జియో దెబ్బకు రెండో రోజూ హడలిపోయిన ఐడియా, ఎయిర్ టెల్!


రిలయన్స్ జియో ఇస్తున్న డేటా ఆఫర్లతో అత్యధిక స్మార్ట్ ఫోన్ వినియోగదారులు నెట్ వర్క్ ను మార్చుకుంటారన్న ఊహాగానాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించగా, వరుసగా రెండవ రోజూ ఐడియా, భారతీ ఎయిర్ టెల్ సంస్థలు నష్టపోయాయి. నిన్న ఐడియా 11 శాతం, ఎయిర్ టెల్ ఆరున్నర శాతం నష్టాల్లో కొనసాగి రూ. 13 వేల కోట్లకు పైగా మార్కెట్ కాప్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే. అదే ప్రభావం నేడు కూడా కనిపించింది. అయితే, అమ్మకాల ఒత్తిడి అంత అధికంగా మాత్రం లేదు. ఐడియా 3.46 శాతం, ఎయిర్ టెల్ 1.35 శాతం పడిపోయాయి. మరోవైపు రిలయన్స్ కమ్యూనికేషన్స్ సైతం 3.5 శాతం దిగజారింది.

  • Loading...

More Telugu News