: వాటికన్ సిటీలో మమతా బెనర్జీ... బెంగాల్ లో నో బంద్!
మదర్ థెరెస్సాకు సెయింట్ హుడ్ ప్రదానం చేయనుండడంతో ఆ వేడుకలో పాల్గొనడానికి కోల్ కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాటికన్ సిటీకి వెళ్లారు. వాటికన్ సిటీకి వెళ్లే ముందు నేడు కార్మిక సంఘాలు చేపట్టనున్న బంద్ విజయవంతం కాదని, తమ రాష్ట్రంలో అన్ని కార్యాలయాలు, సంస్థలు యథావిధిగా పని చేస్తాయని చెప్పిన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులు 25 ఏళ్ల పాటు నిరాఘాటంగా పాలించిన పశ్చిమ బెంగాల్ లో నేటి బంద్ ఎలాంటి ప్రభావం చూపలేదు. మమతా బెనర్జీ చెప్పినట్టుగానే అన్ని కార్యాలయాలు యథావిధిగా పని చేశాయి. రవాణా సర్వీసులు తిరిగాయి. ట్యాక్సీలు, ఆటోలు రోడ్లెక్కాయి. వివిధ కార్మిక యూనియన్లు మాత్రం ర్యాలీలు నిర్వహించాయి. శిలిగురి వద్ద బంద్ కు మద్దతుగా నిలిచిన సీపీఎం ఎమ్మెల్యే అశోక్ భట్టాచార్య సహా 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మినహా ఇతర పెద్ద ఘటనలేవీ చోటుచేసుకోకపోవడం విశేషం.