: 2019 వరల్డ్ కప్ లో చోటుసంపాదించడమే లక్ష్యం : యువరాజ్ సింగ్
2019 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించడమే తన లక్ష్యమని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెప్పాడు. దులీప్ ట్రోఫీలో ఆడుతున్న యువరాజ్ సింగ్ టీమిండియాలో స్థానం సంపాదించేందుకు దారులు ఇంకా మూసుకుపోలేదని అన్నాడు. టీమిండియాలో చోటుదక్కించుకోవడం చాలా కష్టమైన అంశమని, అయినప్పటికీ శక్తివంచన లేకుండా కష్టపడుతున్నానని తెలిపాడు. మరో మూడేళ్ల పాటు తాను క్రికెట్ ఆడగలనని భావిస్తున్నానని, తద్వారా తన వరల్డ్ కప్ ఆశ నెరవేరుతుందని యువీ చెప్పాడు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నానని తెలిపాడు. దేశవాళీ టోర్నీలలో ఆడడం ద్వారా తన కలను నిజం చేసుకుంటానని యువరాజ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.