: 'జంబలకిడిపంబ' తరువాత నేను చూసిన తెలుగు సినిమా ఇదే!: అజారుద్దీన్


23 సంవత్సరాల క్రితం వైజాగ్ లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'జంబలకిడిపంబ' చిత్రాన్ని చూశానని, ఆపై ఇప్పుడు రాజ్ కందుకూరి నిర్మించిన 'పెళ్లిచూపులు' సినిమా చూశానని మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ వ్యాఖ్యానించాడు. గత కొంతకాలంగా తన కుమారుడు అబ్బాస్, ఈ చిత్రం చాలా బాగుందని, చూడాలని చెబుతున్నాడని, ఇన్ని రోజులకు తనకు కుదిరిందని చెప్పాడు. తక్కువ బడ్జెట్ లో చాలా మంచి చిత్రాన్ని తీశారని, సినిమా తనకు ఎంతో నచ్చిందని వివరించాడు. మంచి చిత్రాన్ని అందించిన చిత్ర యూనిట్ కు అజారుద్దీన్ అభినందనలు తెలిపాడు.

  • Loading...

More Telugu News