: ఏపీ కాంగ్రెస్ లో కలకలం!... ఎన్ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడిపై వేటు!
రాష్ట్ర విభజనతో ఏపీలో తలబొప్పి కట్టిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న దేవినేని అవినాశ్ ... తన తండ్రి దేవినేని నెహ్రూతో కలిసి టీడీపీ గూటికి చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో నిన్న ఆ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు నూనె పవన్ తేజపై సస్పెన్షన్ వేటు పడింది. పవన్ తేజ సస్పెన్షన్ కు కారణాలైతే తెలియరాలేదు కాని... ఆయనను సస్పెండ్ చేస్తూ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర ఇన్ చార్జీ షంషేర్ అన్సారీ ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.