: జెన్నీఫర్ కళ్లు, ఏంజలినా బుగ్గలు, పెనలోప్ పెదవులతో... పర్ఫెక్ట్ ఫేస్ ఇదే!
ప్రపంచంలోనే పర్ఫెక్ట్ గా కనిపించే ముఖం ఏది? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరి వద్ద ఒక్కో సమాధానం ఉండవచ్చు. ఒకరికి కళ్లు బాగుంటే, మరొకరికి పెదవులు బాగుంటాయి. ఎంత అందగత్తె ముఖమైనా ఎక్కడో ఓ చిన్న వంక ఉండే ఉంటుంది. ఇక అత్యంత పర్ఫెక్ట్ గా కనిపించే ముఖాన్ని తయారు చేసేందుకు నడుంబిగించిన వరల్డ్ ఫేమస్ ఫేషియల్ కాస్మటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డిసిల్వా, అందగత్తెలకు మరింత అందాన్ని తెచ్చిన అవయవాలను విడిగా కలిపి ఓ ముఖాన్ని రూపొందించారు. దీంతో పర్ఫెక్ట్ ఫేస్ తయారైంది. ఇంతకీ ఈ చిత్రంలో ఉన్న యువతి కనుబొమ్మలు జెన్నిఫర్ లోపేజ్ వి కాగా, కళ్లు కీరా నైట్లీవి. ముక్కును బ్రిటన్ యువరాణి కేట్ విలియమ్ నుంచి, పెదవులను పెనలోప్ క్రూజ్ నుంచి తీసుకున్నారు. బుగ్గలను ఏంజెలినా జోలీ, నుదురు మిలీ సైరస్, దవడను చేర్, గడ్డాన్ని సెలెనా గోమేజ్, చర్మం రీసీ విథర్ స్పూన్ చిత్రాల నుంచి సేకరించామని డిసిల్వా చెబుతున్నారు. ఆ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.