: ఎట్టకేలకు దిగొచ్చిన ఆర్కే రోజా!... స్పీకర్ కు సారీ చెబుతూ లేఖ రాసిన వైసీపీ ఎమ్మెల్యే!


వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎట్టకేలకు దిగొచ్చారు. అసెంబ్లీలో సభా నాయకుడు నారా చంద్రబాబునాయుడు, సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై నిండు సభ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. సారీ చెబితే వదిలేస్తామన్న సర్కారు ఫీలర్లకు ససేమిరా అన్న రోజా... ఇటు హైకోర్టులోనే కాకుండా అటు సుప్రీంకోర్టులోనూ న్యాయ పోరాటం చేశారు. అయితే ఎక్కడా ఆమెకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో చివరకు సారీ చెప్పేందుకే నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆమె సారీ చెప్పేశారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా రోజా రాసిన క్షమాపణ లేఖ నిన్న స్పీకర్ కార్యాలయానికి చేరింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా రోజా కామెంట్లకు టీడీపీ ఎమ్మెల్యే అనిత నిండు సభ సాక్షిగా కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కూడా రోజా తన క్షమాపణ లేఖలో ప్రస్తావించారు. నాడు తాను చేసిన వ్యాఖ్యలు అనితను బాధించి ఉంటే... ఆమెకు కూడా సారీ చెబుతున్నట్లు రోజా సదరు లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News