: ఈ నెల 11న 'ఎంసెట్-3' పరీక్ష


ఈ నెల 11 వ తేదీన తెలంగాణ ఎంసెట్ -3 పరీక్షను నిర్వహించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. తెలంగాణ, ఏపీ లోని 12 పట్టణాల్లో 92 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఎంసెట్-3కి 56,163 మంది అభ్యర్థులు హాజరవుతారని, వీరంతా ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా, గతంలో నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకవడంతో ఆ ఎంట్రన్స్ ను ప్రభుత్వం రద్దు చేసింది.

  • Loading...

More Telugu News