: చంద్రబాబునాయుడు గారూ! మీ నివాసం ముందే ఆత్మహత్య చేసుకుంటా: సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు
అంతర్జాతీయ బ్యాంకు స్కాములో ఇరుక్కున్న కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శనిలా దాపురించాడని ఏపీ ప్రత్యేకహోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ పై ఆయన మండిపడుతూ, బ్యాంకుల స్కాముపై ఉన్నంత అవగాహన ఆంధ్రప్రదేశ్ సమస్యలు, ప్రయోజనాలపై ఉన్నట్టు కనిపించడం లేదని అన్నారు. ప్యాకేజీకి అంగీకరిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం ముందే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆయన హెచ్చరించారు. సుజనా చౌదరిని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయకపోతే చంద్రబాబునాయుడును కూడా ఎవరూ నమ్మే అవకాశం ఉండదని ఆయన తెలిపారు.