: బాబు 'ఓటుకు నోటు కేసు'పై స్పందించిన బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓటుకు నోట్లు కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు స్పందించారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ, ఆరోపణలు ఎదుర్కొనే వారంతా ఏం చేస్తారో ఈ కేసులో నిందితులు కూడా అదే చేస్తారని అన్నారు. చట్టం కూడా తన పని తాను చేసుకుపోతుందని ఆయన చెప్పారు. ఇక దేశంలో ఏ రాష్ట్రానికి చేయని విధంగా కేంద్రం ఏపీకి సాయం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏపీకి 8 జాతీయ సంస్థలు, రక్షణ సంస్థలు, విద్యుదుత్పత్తి సంస్థలను ఇచ్చిన కేంద్రం, పోలవరం నిర్మాణంపై చర్చిస్తోందని, రెవెన్యూలోటు కింద 3,397 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News