: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. వాహన రాకపోకలకు అంతరాయం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షం పడుతోంది. నారాయణగూడ, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోఠి, అబిడ్స్, నాంపల్లి, రాంకోఠితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. వాహనాలు నత్తనడకన ముందుకు కదులుతున్నాయి. ప్రయాణికులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. వర్షాల ధాటికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.