: ఓటుకు నోటు కేసుపై స్పందించిన ఎంపీ కవిత
ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చిన అంశంపై టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ఈరోజు స్పందించారు. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఎంతటివారికైనా విచారణ తప్పదని వ్యాఖ్యానించారు. ఇటువంటి కేసుల్లో చట్టాలు కఠినంగానే వ్యవహరిస్తాయని అన్నారు. కేసులోని అంశాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. కేసులో నిజానిజాలను రాబట్టడానికి ఏసీబీ కేసుకి సంబంధించిన వారందరినీ విచారిస్తుందని వ్యాఖ్యానించారు.