: రిలీజ్ రోజే రెండుసార్లు 'జనతా గ్యారేజ్'ని చూసిన రాజమౌళి... అంతగా నచ్చేసిందని ప్రశంస


తనకు నచ్చిన హీరో ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'ని దర్శకుడు రాజమౌళి అప్పుడే రెండుసార్లు చూసేశాడు. రాత్రి హైదరాబాద్ భ్రమరాంబ థియేటరులో అభిమానుల మధ్య చిత్రాన్ని చూసిన ఆయన, ఉదయం మరోసారి సినిమా చూశాడు. ఆపై చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ, వరుస ట్వీట్లు పెట్టారు. మోహన్ లాల్, తారక్ ల కాంబినేషన్ అద్భుతమని కొనియాడారు. సినిమా చూస్తున్నంత సేపూ ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పిన ఆయన, ఇద్దరూ పోటీపడి నటించారని, టెంపర్ తరువాత తారక్ తన క్యారెక్టర్లు, కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న తీరుకు తానెంతో గర్వపడుతున్నానని చెప్పాడు. తన మిత్రుడు రాజీవ్ కనకాల ప్రభుత్వ క్లర్క్ పాత్రలో గుండెలను తాకేంతగా నటించారని, రెండోసారి చూస్తున్నా తాను ఎంజాయ్ చేశానని చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు.

  • Loading...

More Telugu News