: ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని అనుకుంటున్నా: చంద్రబాబు
ఏపీకి ప్రత్యేక హోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని అనుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన హామీల అమలుపై కేంద్రం కసరత్తు చేస్తోందని, కేంద్రానికి సంబంధించిన పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, దీంతోపాటు పోలవరం, రాజధాని నిర్మాణం, ఆర్థిక లోటు భర్తీ, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ వంటి డిమాండ్లను కేంద్రం నెరవేర్చాలన్నారు.