: కరూర్ ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం... ప్రేమించలేదని యువతిని హత్యచేసిన విద్యార్థి
చెన్నైలోని కరూర్ ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది ఘాతుకానికి తరగతి గదిలోనే విద్యార్థిని నిండుజీవితం బలైంది. వివరాల్లోకి వెళ్తే.. సోనాలి అనే విద్యార్థిని కరూర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది. సెకండియర్ విద్యార్థిని అయిన సోనాలిని ఆమె సీనియర్ అయిన ఉదయ్ కుమార్ అనే విద్యార్థి ప్రేమిస్తున్నానని చాలా కాలంగా వెంటపడుతున్నాడు. అతని ప్రేమను సోనాలి నిరాకరించింది. ఈ విషయం చాలాసార్లు చెప్పినప్పటికీ ఆమెను వేధించడంలో తన వైఖరి మార్చుకోని ఉదయ్ కుమార్ నేటి ఉదయం కర్ర పట్టుకుని ఆమె క్లాస్ రూంలోకి ప్రవేశించాడు. సోనాలిని ప్రేమించాలని హెచ్చరించాడు. దానికి ఆమె నిరాకరించడంతో ఆమెపై కర్రతో దాడి చేసి హత్యచేశాడు. దీంతో కళాశాలలో భయానక వాతావరణం నెలకొంది.