: తిరుపతి సభలో పవన్ కల్యాణ్ బీజేపీని విమర్శించలేదు: ఏపీ ఇన్ చార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్


తిరుపతిలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో బీజేపీ గురించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎటువంటి విమర్శలు చేయలేదని ఏపీలో బీజేపీ ఇన్ చార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీలన్నింటిని నెరవేర్చుతామన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వటానికి రాజ్యాంగ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రత్యేకహోదా వలన వచ్చే అన్ని రకాల ప్రయోజనాలను నెరవేర్చేందుకుగాను కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని సిద్ధార్ధ్ సింగ్ అన్నారు.

  • Loading...

More Telugu News