: కరీంనగర్ జిల్లా జైలు వద్ద ఉద్రిక్తత... టీడీపీ నేతపై తుపాకీ ఎక్కుపెట్టిన కానిస్టేబుల్
కరీంనగర్ జిల్లా జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జైలులో ఉన్న కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు విజయరమణారావును కలిసేందుకని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ నాయకులకు, జైలు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన ఒక కానిస్టేబుల్ టీడీపీ నేత మేడిపల్లి సత్యంపైకి తుపాకీ ఎక్కుపెట్టాడు. దీంతో, జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.