: నా ఇల్లు ముంబైలోనే వుంది...లాస్ ఏంజిలెస్ లో కాదు: ప్రియాంకా చోప్రా


'క్వాంటికో' సీరియల్, 'బేవాచ్' సినిమాతో సినీ నటి ప్రియాంకా చోప్రా అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో స్థిరపడిపోయినట్టేనని... త్వరలో బాలీవుడ్ నుంచి బిచాణా ఎత్తేయనుందని బీ-టౌన్ లో వూహాగానాలు వెల్లువెత్తాయి. దీంతో వీటిపై ప్రియాంకా చోప్రా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. కొన్ని వార్తలు వింటే తనకు హాస్యాస్పదంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయని తెలిపింది. గత కొన్ని రోజులుగా తన నివాసంపై వస్తున్న ఊహాగానాలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం 'క్వాంటికో' సీరియల్ షూటింగ్ ఉండడంతో తాను న్యూయార్క్ లో ఉన్నానని చెప్పింది. తన నివాసం లాస్ ఏంజిలెస్ కాదని, ముంబై అని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News