: కౌలాలంపూర్ లోని ప్రఖ్యాత హిందూ ఆలయం పేల్చివేతకు కుట్ర... ఉగ్రవాదుల పట్టివేత!


కౌలాలంపూర్ లోని బాతు కేవ్స్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ‌ హిందూ దేవాలయాన్ని పేల్చివేసేందుకు కుట్ర చేసిన ఉగ్ర‌వాదుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు మలేషియా స్వాతంత్ర్య దినోత్సవం జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సోదాలు చేప‌ట్టిన పోలీసుల‌కి ముగ్గురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు ప‌ట్టుబ‌డ్డారు. వారు దేవాల‌యంతో పాటు అక్క‌డి ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పరికరాల విక్రయ సంస్థలపై కూడా దాడుల‌కు దిగాలని ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆ దేశంలో చేసిన దాడి వంటి ఘ‌ట‌నే మ‌ళ్లీ కౌలాలంపూర్ లోని బాతు కేవ్స్ స‌మీపంలో చేయ‌డానికి ఉగ్ర‌వాదులు కుట్ర‌ప‌న్నార‌ని పోలీసులు పేర్కొన్నారు. ముమ్మ‌రంగా గాలించి రెండు ప్రాంతాల్లో ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News