: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు భారీ ఎదురుదెబ్బ.. అమెరికా సంయుక్త బలగాల దాడుల్లో అద్నానీ హతం


ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సిరియాలోని అలెప్పో ప్రావిన్స్‌లో అమెరికా, సిరియా సంయుక్త దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న పోరును పర్యవేక్షించేందుకు వెళ్లిన ఆ సంస్థ అధికార ప్రతినిధి అబు మహ్మద్ అల్ అద్నానీ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఐసిస్ కూడా నిర్ధారించింది. ఉగ్రసంస్థ సీనియర్ నేతలే లక్ష్యంగా చేసిన దాడిలో అద్నాన్ హతమయ్యాడు. ‘‘ఐసిస్ సీనియర్ నేతను లక్ష్యంగా చేసుకుని సంయక్త బలగాలు దాడులకు దిగాయి. ఈ దాడిలో అద్భుత విజయాన్ని సాధించాం’’ అని అమెరికా అధికారులు ప్రకటించారు. కాగా అద్నానీ చనిపోతే అలాంటివారు మరికొందరు వస్తారని ఐసిస్ పేర్కొంది.

  • Loading...

More Telugu News