: ప్రధాని మోదీ హెచ్చరికే ఫొటోగ్రాఫర్ల ప్రాణాలు కాపాడింది!
ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించిన కారణంగా మీడియా కెమెరామన్, ఫొటోగ్రాఫర్లు ఓ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే, మోదీ ఈరోజు గుజరాత్ లో పర్యటించారు. పర్యటనలో భాగంగా సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ (సౌని) పథకం కింద ఆజి-3 డ్యామ్ ను మోదీ ప్రారంభించారు. డ్యామ్ స్విచ్ ఆన్ చేసిన అనంతరం నీటి విడుదలను ప్రధాని గమనిస్తున్నారు. ఈ సందర్భంలో నీరు వెళుతున్న దిగువ ప్రాంతంలో ఉండి ఫొటోలు తీస్తున్న మీడియా ఫొటోగ్రాఫర్లు, వీడియో చిత్రీకరిస్తున్న కెమెరామన్ ని ఆయన గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన మోదీ, చప్పట్లు కొట్టి మరీ, వారిని అక్కడి నుంచి తప్పుకోమని చేతులూపి చెప్పారు. ఈ ప్రమాదాన్ని గమనించిన వారు వెంటనే అక్కడి నుంచి తప్పుకున్నారు.