: పవన్ కల్యాణ్ తో చర్చలకు మేము సిద్ధం: సీపీఐ నారాయణ


'చేతనైతే రాజకీయాల్లోకి రా...లేదంటే రజనీకాంత్ లా ఇంట్లో కూర్చో' అంటూ గత వారం పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఐ జాతీయ స్థాయి నేత నారాయణ నేడు హైదరాబాదులో అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తో చర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు. పవన్ కల్యాణ్ లో కమ్యూనిస్టు భావాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఏపీలో పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడిందని, అధికార ప్రతిపక్ష పార్టీలపై ప్రజల్లో నమ్మకం సడలిపోయిందని అన్నారు. దీనికి కారణం అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకహోదాను నిర్లక్ష్యం చేయడమేనని ఆయన చెప్పారు. ఇలాంటి సమయాల్లో పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే...ప్రజలంతా ఆయన వెంట నడిచే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో వారం రోజులు కూడా పూర్తికాకముందే నారాయణ స్వరం మారడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News