: హైదరాబాద్ లో ఎయిర్ హోస్టెస్ కిడ్నాప్ కు క్యాబ్ డ్రైవర్ విఫలయత్నం


హైదరాబాద్ లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విధులు ముగించుకుని వస్తున్న ఎయిర్ హోస్టెస్ ను ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. ఈ ఘటన రాజేంద్రనగర్ లో జరిగింది. తాను వెళ్లాల్సిన మార్గంలో కాకుండా మరో దారిలో క్యాబ్ వెళుతోందని గుర్తించిన ఎయిర్ హోస్టెస్ కేకలు పెట్టగా, ఆమెను బెదిరించిన డ్రైవర్, సెల్ ఫోన్ ను లాక్కుని, బలవంతంగా కిందకు దించి వెళ్లిపోయాడు. జరిగిన ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్యాబ్ ను గుర్తించేందుకు విమానాశ్రయం నుంచి రాజేంద్రనగర్ వరకూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్టు డీసీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News