: ప్రియురాలు ప్రేమతో ఇచ్చిన ముద్దు అతని ప్రాణాలు తీసింది!


ప్రేమతో ఇచ్చిన ముద్దు విషమై ప్రాణాలు తీసిన ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జులియో మేసియస్ గొంజాలెజ్ (17) తన ప్రియురాలి (24) తో డిన్నర్ కు ఓ హోటల్ కు వెళ్లాడు. డిన్నర్ కు తీసుకువచ్చిన ప్రియుడిపై ప్రేమ ఉప్పొంగడంతో అతనిని దగ్గరకు తీసుకుని ప్రేమగా అతని మెడపై చిన్నగా కొరికింది. అయితే ఈ కొరకడంలో ఏ నరాన్ని కొరికేసిందో తెలియదు కానీ, వెంటనే కిందపడ్డ జులియో మేసియస్ మూర్ఛతో గిలగిల తన్నుకుని మృత్యువాతపడ్డాడు. దీంతో ఆమె ఆందోళన చెందడంతో అతనిని హోటల్ సిబ్బంది హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రియురాలు అతని మెడ దగ్గర కొరకడం వల్ల మెదడులో రక్తం గడ్డకట్టి మరణించాడని వైద్యులు తేల్చారు. దీంతో ప్రేమ ముద్దు విషమై కూర్చుందని నిట్టూర్చిన ఆమె పరారైంది. దీంతో కేసు నమోదు చేసిన మెక్సికో పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. తమ కుమారుడి ప్రాణాలు అతని ప్రియురాలే తీసిందని జూలియో మేసియస్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News