: మైనర్ భార్యతో మైనర్ భర్త శృంగారం రేప్ కిందకి రాదు: కేంద్ర ప్రభుత్వం


మైనర్ వ్యక్తి, మైనర్ అయిన తన భార్యతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు రాదని కేంద్రం స్పష్టం చేసింది. బాల్యవివాహాలు, సంప్రదాయాల గురించి వివరిస్తూ ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ లో కేంద్రం ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేసింది. ఐపీసీ 375లోని ఓ సెక్షన్‌‌ ను సవాల్ చేస్తూ ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా బాల్య వివాహాలపై ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని వివరణ కోరింది. దీంతో కేంద్రం వివరణ ఇస్తూ...తాము బాల్య వివాహాలను సమర్థించడం లేదని స్పష్టం చేసింది. అయితే దేశంలోని కొన్ని సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్ల కారణంగా జరిగే బాల్య వివాహాలకు భార్యాభర్తల విలువలే వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. 15 ఏళ్ల కంటే తక్కువైన వ్యక్తి అంతకంటే తక్కువ వయసున్న తన భార్యతో జరిపే శృంగారం అత్యాచారం కిందకు రాదని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

  • Loading...

More Telugu News