: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు: భూమన కరుణాకర్ రెడ్డి


ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసు దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్ వదిలి పారిపోయారన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రే లంచాలిస్తూ దొరికిపోయారని, అటువంటి వ్యక్తి సీఎంగా ఉండటం తెలుగు జాతికే అవమానకరమని, చంద్రబాబు తన పదవికి ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించారు. తనకు ఏసీబీ, పోలీస్ ఉందని చెప్పిన చంద్రబాబు పెట్టేబేడ సర్దుకుని విజయవాడకు పారిపోయారని, కేంద్రం, కేసీఆర్ దగ్గర సాగిలాపడి బయటపడటానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీకి చంద్రబాబు లొంగిపోయారని, కేసీఆర్ కు చంద్రబాబు రూ.500 కోట్ల ముడుపులు ఇచ్చారని టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News