: పెప్సీ కొత్త ఐకాన్ గా కోహ్లీ!... ధోనీ ప్లేస్ లో విరాట్ ఎంపిక!
టీమిండియాకు కొత్త దేవుడు దొరికాడు. సీనియర్ జట్టులోకి రాకముందే జూనియర్స్ టీ20 వరల్డ్ కప్ ను సాధించి సత్తా చాటిన విరాట్ కోహ్లీ... ఆ తర్వాత జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నాడు. కోహ్లీ ఎంటరైన సమయంలో జట్టుకు విజయవంతమైన కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీని మరిపిస్తూ కోహ్లీ చేసిన, చేస్తున్న వీరవిహారం యావత్తు క్రికెెట్ అభిమానులను హర్షాతిరేకాల్లో ముంచెత్తుతోంది. ఈ క్రమంలో వయసు మీద పడుతున్న ధోనీ... టెస్టు కెరీర్ కు వీడ్కోలు పలకగా, సీనియర్లను కాదని బీసీసీఐ కోహ్లీకి పగ్గాలు అప్పగించింది. ఓ వైపు టెస్టు క్రికెట్ లో కెప్టెన్సీ బాధ్యతలు భుజాలపై పడ్డా కోహ్లీలో ఏమాత్రం పదును తగ్గలేదు. ఇదే విషయాన్ని గ్రహించిందేమో తెలియదు కాని... బహుళ జాతి కంపెనీ పెప్సీకో అతడిని తన కొత్త ఐకాన్ గా ఎన్నుకుంది. ధోనీకతో 11 ఏళ్ల వాణిజ్య బంధానికి గుడ్ బై చెప్పేసిన పెప్సీకో... ధోనీ స్థానాన్ని కోహ్లీకి కట్టబెట్టేంది.ఈ ఒప్పందానికి సంబంధించి పెప్సీకో నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.