: వనస్థలిపురంలో నయీమ్ అనుచరుడు!... అదుపులోకి తీసుకున్న సిట్!
తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు సంబంధించిన దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముమ్మరం చేసింది. తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో నయీమ్ నడిపిన దందాపై కూపీ లాగుతున్న సిట్ అధికారులు... తాజాగా హైదరాబాదు శివారు ప్రాంతం వనస్థలిపురంలో ముమ్మర సోదాలు చేశారు. వనస్థలిపురంలో నయీమ్ అనుచరుడు నరేందర్ రెడ్డికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించిన సిట్ అధికారులు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అక్కడికి చేరుకున్నారు. వనస్థలిపురాన్ని జల్లెడ పట్టిన అధికారులు ఎట్టకేలకు నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.