: మరో వారం రోజుల్లో మా ఇంట్లో కవలలు సందడి చేస్తారు: యాంకర్ ఉదయభాను
తన గర్భంలో ప్రస్తుతం కవల పిల్లలున్నారని, తమ ఇంట్లో పిల్లల సందడి మొదలవుతుందని, మరో వారం రోజుల్లో తల్లి కాబోతున్న టీవీ స్టార్ యాంకర్ ఉదయభాను చెప్పింది. తమ కుటుంబంలో ఇద్దరు కొత్త వ్యక్తులు రానున్నారనే విషయం తలచుకుంటే ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది. గర్భవతిగా ఉండటం వల్లే తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చానని చెప్పింది. కాగా, పదేళ్ల క్రితం బిజినెస్ మెన్ విజయ్ తో ఉదయ భాను వివాహం జరిగింది.